T20 World Cup: సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఆ జట్టు బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు జోరు పెంచలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేయగా,…
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి ఆసన్నమైంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగియగా.. ఇక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంటోంది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి సెమీఫైనల్ పోరు ప్రారంభం కానుంది. తొలి సెమీస్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడతాయి. గురువారం అడిలైడ్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో అడిలైడ్ వేదికగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడింది. అయితే ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాత్రం ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అడిలైడ్‌లో పరిస్థితులపై…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడితే మరోసారి చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఇచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఇరు దేశాల…
T20 World Cup: టీమిండియాతో ఈనెల 10న జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే భారత్‌తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తం అవుతున్న ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గజ్జల్లో గాయంతో మలాన్ బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్‌లో బౌండరీ వద్ద…
టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్.
T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్‌కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఈవారం నాకౌట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. బుధవారం నాడు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. గురువారం నాడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మేరు సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరీ) జాబితాను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా రిచర్డ్ కెటిల్‌బరో, మైఖేల్ గాఫ్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. క్రిస్ బ్రాడ్…
Team India: టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అతడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లోనూ సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో ఒక్క ఏడాదిలో వెయ్యి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ అలియస్ మిస్టర్ 360 రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఆడిన అన్ని టీ20…