T20 World Cup: సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఆ జట్టు బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు జోరు పెంచలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేయగా, డారిల్ మిచెల్ 35 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫిన్ అలెన్ (4), కాన్వే (21), గ్లెన్ ఫిలిప్స్ (6) విఫలమయ్యారు.చివరి ఓవర్‌లో బౌండరీ ఇవ్వకుండా కట్టడి చేసిన నసీమ్ షా 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో కివీస్ 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా మహ్మద్ నవాజ్ ఓ వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలంటే పాకిస్థాన్ 153 పరుగులు చేయాల్సి ఉంది.
Read Also: Uttarakhand: లెహంగా నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. ట్విస్టుల మీద ట్విస్టులు