T20 World Cup: మెగా టోర్నీ ఫైనల్‌పై డివిలియర్స్ జోస్యం.. ఆ రెండు జట్ల మధ్యే తుదిపోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడితే మరోసారి చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఇచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటున్నారు. ఆ అవకాశం కూడా ఉండటంతో ఫైనల్ పోరులో భారత్, పాకిస్థాన్ జట్లను చూడాలని ఆకాంక్షిస్తున్నారు. 2007 ప్రపంచకప్ నాటి మధుర క్షణాలను మరోసారి ఆస్వాదించాలని తాపత్రయపడుతున్నారు.
Read Also: T20 World Cup: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ
Also Read
- India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
సాధారణ క్రికెట్ అభిమానులే కాదు దక్షిణాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగాలని బలంగా కోరుకుంటున్నాడు. అందుకే అతడు తన ట్విటర్ అకౌంట్‌లో ఓ పోల్ కూడా నిర్వహించాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైనల్ జరుగుతుందా లేదా అని పోల్ నిర్వహించగా.. ఏకంగా 77 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. ఈ పోల్ ఫలితాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తాను కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నట్లు డివిలియర్స్ చెప్పాడు. కాగా ఈనెల 9న న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్, ఈనెల 10న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరగనున్నాయి. తొలి సెమీస్‌లో పాకిస్థాన్, రెండో సెమీస్‌లో టీమిండియా గెలిస్తే అభిమానుల ఆకాంక్ష నెరవేరుతుంది. మరి ఏం జరుగుతుందో మరో రెండు రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.
Pakistan/India final?
— AB de Villiers (@ABdeVilliers17) November 7, 2022
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!