T20 World Cup: పాకిస్థాన్‌ను ఊరిస్తున్న 1992 ప్రపంచకప్ సెంటిమెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్‌కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ సోషల్ మీడియాను ఊదరగొడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Read Also: టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లలో ఆధిపత్యం ఎవరిది?
Also Read
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
- IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
1992 వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగానే జరిగింది. అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. అప్పటి సెమీస్ రేసుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ చేరుకోగా.. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ మూడు జట్లు సెమీస్ చేరుకోవడం పాకిస్థాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో కూడా ఆతిథ్య ఆస్ట్రేలియా నాకౌట్ చేరకుండానే వెనుదిరగడం వంటి పరిస్థితులు చూస్తుంటే ఫైనల్‌లో ఇంగ్లండ్ లేదా టీమిండియాను ఓడించి పాకిస్థాన్ 1992 ప్రపంచకప్ రిపీట్ చేస్తుందని ఆ జట్టు అభిమానులు సంబరపడుతున్నారు. అప్పుడు కూడా ఒక్క పాయింట్ తేడాతో పాకిస్థాన్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుందని.. ఇప్పుడు కూడా దక్షిణాఫ్రికాకు, పాకిస్థాన్‌కు ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉండటంతో ఆ జట్టును అధిగమించి సెమీస్‌కు వెళ్లడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.
Pakistan at the 1992 ODI World Cup 🤝 Pakistan at the 2022 T20I World Cup pic.twitter.com/aDvZfN5XTR
— ESPNcricinfo (@ESPNcricinfo) November 7, 2022
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!