Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను “హ్యాండ్‌షేక్ వివాదం” కారణంగా ఆడకుండా బహిష్కరించినట్లు సమాచారం. అందిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకునట్లు సమాచారం. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై సరిగా వ్యవహరించలేదని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)…
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి కారణం.. హ్యాండ్‌షేక్. ఎందుకంటే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. శివం దుబేతో కలిసి కెప్టెన్ సూర్య పాకిస్థాన్ జట్టును పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 'హ్యాండ్ షేక్ వివాదం' అంశాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ముందు లేవనెత్తింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్ కూడా దాఖలైంది. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. కేంద్రం కూడా వద్దని చెప్పలేదు. మరోవైపు ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నట్లు బీసీసీఐ కూడా తెలిపింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఉగ్రవాద దాడి బాధితు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నా అని తెలిపాడు. బాధిత కుటుంబాలకు భారత జట్టు తరఫున సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నాడు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు సూర్య ధన్యవాదాలు తెలిపాడు. భారతదేశానికి ఈ విజయం ఒక అద్భుతమైన రిటర్న్…
ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో దాయాదులతో పోరాడేందుకు భారత్ రెడీ అవుతోంది. అయితే పాక్ పై భారత ఆటగాళ్ల పెర్ఫామెన్స్ చాలా బాగుంది. కానీ ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే రెండు జట్లలోనూ చాలా మంది ఆటగాళ్లు T20లో తొలిసారిగా ఒకరితో ఒకరు తలపడనున్నారు. పాకిస్తాన్ పై టీమిండియా ఆటగాళ్ల T20 రికార్డును పరిశీలించినట్లైతే.. Also Read:CM Chandrababu: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు.. సూర్యకుమార్ యాదవ్…
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా…
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో యూఏఈలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తన మొదటి మ్యాచ్ యూఏఈతో ఆడనుంది. టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్స్ గత వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్‌లో పాల్గొనే 8 దేశాల కెప్టెన్లు సోమవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సన్నద్ధత గురించి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ప్రెస్ మీట్లో సూర్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురవగా..…
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవనుంది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఏఈతో భారత్ తలపడనుంది. ఆసియా కప్ ప్రారంభం నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో 8 మంది కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. సంజూ శాంసన్‌పై ప్రశ్నకు సూర్య తనదైన శైలిలో రిప్లై…
ఆసియా కప్ T20 2025 కోసం భారత జట్టు శుక్రవారం దుబాయ్ చేరుకుంది. జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, హార్దిక్ పాండ్యా ICC అకాడమీ గ్రౌండ్లో కనిపించారు. అయితే, జట్టు రాక కంటే హార్దిక్ లుక్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆసియా కప్ T20 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. భారతదేశం సెప్టెంబర్ 10న UAEతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 14న…
Is Gautam Gambhir’s Influence Changes Agarkar’s Choice: యూఏఈలో సెప్టెంబర్ 9న ఆరంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో జట్టును ప్రకటించాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఇక అందరూ ఊహించినట్లే వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ వెల్లడించిన మొదటి పేరు గిల్‌దే కావడం గమనార్హం. అయితే వైస్ కెప్టెన్‌గా అగార్కర్…