IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. డచ్ జట్టుపై పరుగుల వేటకు ‘సూర్య’ సేన సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NED: నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా పరుగుల వరద పారించి, డచ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూనే, రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే పనిలో పడినట్లు కనిపించింది.
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చారు. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి తీసుకొచ్చారు. అలాగే స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కి రెస్ట్ ఇచ్చి, తన స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్లు ఇవే:
భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
నెదర్లాండ్స్: మైకెల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడె, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), జాక్ లైయన్ కాచెట్, నోవ్ క్రోయిస్, రోలెఫ్ వాన్ డిర్ మెర్వ్, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లీన్.
పిచ్ అంచనాలు..
బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేయడం భారత్‌కు కలిసివచ్చే అంశంగా క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు మరోసారి భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. డచ్ జట్టులో లోగాన్ వాన్ బీక్, వాన్ డిర్ మెర్వ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ.. భారత బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడం వారికి సవాలే అని చెబుతున్నారు.
READ ALSO: Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!