ఐపీఎల్లో సత్తాచాటిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్.. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన సూర్య.. 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆపై రోహిత్ శర్మ సారథ్యంలో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల ఆసియా కప్ 2025లో భారత జట్టును విజేతగా నిలిపిన సూర్య.. ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఇక తన కోరిక…
ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గాడు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. అయితే పీసీబీ చీఫ్…
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ 2025లో అద్భుతంగా రాణించింది. సూర్య బ్రిగేడ్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి ట్రోఫీని గెలుచుకుంది. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారతదేశం తన తొమ్మిదవ ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2025 ఆసియా కప్ ముగిసిన తర్వాత , భారత T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశం హర్షించే నిర్ణయం తీసుకున్నాడు. 2025…
ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో రెండు బంతులు ఉండగానే ఛేదించి.. తొమ్మిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. ఆసియా…
Sunil Gavaskar: యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో చేసిన 47 నాటౌట్ ఇన్నింగ్స్ మినహా అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూర్యకుమార్‌కు ఒక సూచన ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు కనీసం…
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. స్పిన్నర్ వానిందు హసరంగ బౌలింగ్‌లో సూర్య ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 12 రన్స్ మాత్రమే చేశాడు. ఆసియా కప్ 2025లో సూరీడు ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌కు ఆడి 71 రన్స్ మాత్రమే చేశాడు. టోర్నీలో 7* (2), 47*…
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అప్పుడే ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అభిషేక్ 900లకు పైగా రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదివరకు టీ20 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 900లకు…
IND vs BAN: పాకిస్తాన్‌పై భారీ విజయాన్ని సాధించిన భారత్.. ఆసియా కప్ 2025 సూపర్ 4లో తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో నేడు (సెప్టెంబర్ 24) తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. గణాంకాల…
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్‌ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది.…