Article 370: ‘‘ఆర్టికల్ 370ని తీసేయలేరు’’.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.
J&K పీపుల్స్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు డాక్టర్ హుస్సేన్ మరియు J&K అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ముజాఫర్ షా మాట్లాడుతూ..తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ‘‘ ఆర్టికల్ 370ని తీసేయలేమని.. ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని, మేము కోర్టులో కోర్టులో చర్చిస్తాము’’ అని ముజఫర్ షా చెప్పారు. సీపీఐ(ఎం)కి చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అడ్వకేట్ ముజఫర్ ఇక్బాల్, పీడీపీలు కూడా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
Read Also: 12th Fail: రియల్ లైఫ్ “12th ఫెయిల్” ఐపీఎస్ ఆఫీసర్, భార్యతో ఉన్న ఫోటోలు వైరల్..
గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో పాటు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ మరియు సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దుని సమర్థించింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమే అని నొక్కి చెప్పింది. యుద్ధకాల పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 రూపొందించబడిందని చెప్పింది. భారత యూనియన్‌లో చేరిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండలేదని సుప్రీం వ్యాఖానించింది. రాజ్యాంగ పరిషత్ ఆగిపోయినందున ఆర్టికల్ 370 శాశ్వతంగా కొనసాగుతుందని అర్థం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని రద్దుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని సుప్రీం పేర్కొంది. సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆగస్టు 5, 2019న, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!