Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని చెప్పుకొచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ బీవి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని తెలిపింది. ఈ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
Read Also: Ayodhya Rama: అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. చేనేత కార్మికులకు చేతినిండా పని..!
కాగా, 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హతమర్చారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో 11 మంది దోషులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే, గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని రిలీజ్ చేసింది.
Read Also: Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
ఇక, గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిందితులకు శిక్షను రద్దు చేయడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. నిందితుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా స్టార్ట్ చేశాడు. దీనిని బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఇవాళ సుప్రీం కోర్టు బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government
Read @ANI Story | https://t.co/4K2Lx1nqbE#BilkisBanocase #SupremeCourt #GujaratGovernment pic.twitter.com/bahrsYnBOs
— ANI Digital (@ani_digital) January 8, 2024