Chief Justice Of India: సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి నిన్న (శుక్రవారం) రెండు విస్కీ బాటిళ్లను పెట్టడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ షాక్ అయ్యారు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, జేకే ఎంటర్ ప్రైజెస్ మధ్య కొనసాగుతున్న ట్రేడ్ మార్క్ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీలు పిటిషన్ విచారణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ అప్పీలును దాఖలు చేసిన పెర్నోడ్ రికార్డ్ కంపెనీ తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు.
Read Also: KTR Tweet: ఫార్ములా ఈ రేస్ రద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
ఇక, లండన్ ప్రైడ్ పేరుతో మద్యాన్ని రెడీ చేయకుండా జేకే ఎంటర్ ప్రైజెస్ కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ముకుల్ రోహత్గి కోరారు. ఈ అప్పీలుపై విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ న్యాయవాది రోహత్గి మాట్లాడుతూ.. మద్యం ప్రొడక్ట్స్ ను కోర్టులోకి తీసుకు వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అనంతరం రెండు విస్కీ బాటిళ్లను సుప్రీం ధర్మాసనం ముందు ఆయన పెట్టారు. వాటిని చూసిన సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. మీతో పాటు బాటిల్స్ ను తీసుకొచ్చారా?’ అని ప్రశ్నించారు.. సీజేఐకి రోహత్గి సమాధానం ఇస్తూ.. ఈ రెండు ప్రొడక్ట్స్ మధ్య భేదాలను చూపించేందుకు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ట్రేడ్ మార్క్ చట్టాల ఉల్లంఘన ఏ విధంగా జరిగిందో ముకుల్ రోహిత్గి వివరించారు. అనంతరం హైకోర్టు తీర్పును నిలిపేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది.