Atul Subhash Suicide: భార్య, అత్తమామల క్రూరత్వం కారణంగా 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపుల కేసులో తనను ఇరికించారని, భార్య, ఆమె కుటుంబం వేధిస్తుందని చెబుతూ ఆయన ఆత్మహత్య చేసుకున్న తీరు అందర్ని కంటతడి పెట్టిస్తోంది. బీహార్‌కి చెందిన అతుల్, బెంగళూర్‌లోని తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. న్యాయవ్యవస్థ కూడా తన భార్య నికితా సింఘానియకు మద్దతుగా నిలిచిందని, ఏ తప్పు చేయకున్నా తనను వేధిస్తున్నారంటూ ఆయన 24 పేజీల సూసైడ్ నోట్‌తో సహా 80 నిమిషాల వీడియో చేసి తన బాధను వ్యక్త పరిచాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆయనకు న్యాయం జరగాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తు్న్నారు.
అయితే, ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఒక వ్యక్తి, అతడి తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కేసును కొట్టివేయడానికి నిరాకరించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే భార్య ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని కోర్టు గుర్తించింది. కొంత మంది నిందితులకు ఈ విషయంలో సంబంధం లేదని, ఎలాంటి కారణం లేకుండా ఈ కేసులోకి లాగబడ్డారని పేర్కొంది. ‘‘వివాహ వివాదాల్లో ఉత్పన్నమయ్యే క్రిమినల్ కేసులో కుటుంబ సభ్యుల పేర్లు సూచించడం, వారిపై నిర్దిష్ట ఆరోపణలు లేకుంటే వాటిని ప్రారంభంలోనే తుడిచివేయాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..
‘‘వైవాహిక వివాదాల్లో భర్త కుటుంబంలోని సభ్యులందర్ని ఇరికించే ధోరణి తరుచుగా ఉంటుంది’’ నిర్ధిష్ట సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు విచారణకు ఆధారం కావు అని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మసనం వ్యాఖ్యానించింది. చట్టపరమైన నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియల దుర్వినయోగం చేయకుండా నిరోధించడానికి ఇలాంటి కేసుల్లో కోర్టులు జాగ్రత్తగా వ్యహరించాలని, అమాయక కుటుంబ సభ్యులపై అనవసరమైన వేధింపులను నివారించాలని చెప్పింది.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498A, ఒక మహిళపై ఆమె భర్త లేదా అతని బంధువుల ద్వారా క్రూరత్వాన్ని శిక్షించేలా, రాష్ట్రం త్వరగా జోక్యం చేసుకునేలా చట్టంలో చేర్చబడిందని కోర్టు పేర్కొంది. ఐపీసీ స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 80 వరకట్న మరణాలకు సంబంధించింది. సెక్షన్ 85 మహిళలపై భర్త లేదా అతని బంధువుల క్రూరత్వానికి సంబంధించిందని. ఇటీవల కాలంలో వివాహ వ్యవస్థలో వివాదాలు గణనీయంగా పెరుగుతున్నాయని, భార్య తన భర్త, ఇతర కుటుంబ సభ్యులపై వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి సెక్షన్ 498A వంటి నిబంధనలను దుర్వినియోగం చేసే ధోరణి పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘వివాహ తగాదాల్లో అస్పష్టమైన ఆరోపణలు చేయడం, పరిశీలించబడకపోతే చట్టపరమైన ప్రక్రియాలను దుర్వినియోగం చేయడం, భార్య ఆమె కుటుంబ సభ్యులు అనేక వ్యూహాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోంది. న్నిసార్లు, భార్య యొక్క అసమంజసమైన డిమాండ్‌లకు అనుగుణంగా భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై 498Aని అమలు చేస్తున్నారు’’ అని కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది. అదే సమయంలో క్రూరత్వానికి గురైన మహిళలు మౌనంగతా ఉండాలని కోర్టు పేర్కొనడంయ లేదని స్పష్టం చేసింది.