Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నిత్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు విధించడంతో.. ప్రస్తుతం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో జీఆర్‌ఏపీ-4 ఆంక్షల సడలింపుకు అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిధిలో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై కోర్టు విచారణ చేపట్టింది. గత నెల రోజులుగా కాలుష్యం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తాజాగా గాలి నాణ్యత సూచీలో మెరుగుదల కనిపించడంతో.. జీఆర్‌ఏపీ-4 ఆంక్షల సడలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: YS Jagan: సమయం వచ్చింది.. జిల్లాల్లోనే నిద్ర చేస్తా: వైఎస్ జగన్
కాగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చి వేయడంతో కాలుష్య పెరుగుదలకు ప్రధాన కారణం అయింది. దీని వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించిపోయింది. దీని వల్ల ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే కాలుష్య కట్టడికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జీఆర్‌ఏపీ-4 ఆంక్షలను అమలు చేసింది. దీంతో గాలి నాణ్యతలో మెరుగు పటడంతో ఆంక్షల సడలించుకునే అవకాశం సుప్రీం కోర్టు కల్పించింది.