Supreme Court: ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలాలే ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Sambal Conflict: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్‌లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా క్షిణించింది. దీంతో కాలుష్య నివారణకు చేపట్టిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 4 అత్యవసర చర్యలను కొనసాగించాలా వద్దా అని సుప్రీంకోర్టులో ఈరోజు (సోమవారం) విచారణకు రానుంది.
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు.
Ban jokes on Sikhs: సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి జోకులను ప్రదర్శించే వెబ్సైట్లను నిషేధించాలే ఆదేశాలు ఇవ్వానలి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ‘‘ఇది చాలా ముఖ్యమైన విషయం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది.
వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది
Supreme Court: ఈ రోజు (గురువారం) వేర్పాటు వాది యాసిన్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఉగ్ర దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని తెలిపింది.
Darshan Case: కన్నడ స్టార్ నటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో దాదాపుగా 4 నెలల పాటు జైలులో ఉన్న దర్శన్‌కి ఇటీవల ఆరోగ్య కారణాలతో కర్నాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజైరు చేసింది.
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్లైన్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఫిజికల్ మీడియం ద్వారా పాఠశాలకు వెళ్లేవారు. అలాగే.. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
బల్వంత్‌సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ముందు సమర్పించాలని రాష్ట్రపతి కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణశిక్ష విధించబడింది.