AP Capital Case: ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేయనుంది సుప్రీం.. అయితే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.. ఈ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది కూటమి సర్కార్.. అమరావతి ఏకైక రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.. ఇక, రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఆ అఫిడవిట్‌లో పేర్కొంది కూటమి ప్రభుత్వం.. దీంతో.. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Manchu Lakshmi: కుటుంబంలో పెను వివాదం.. మంచు లక్ష్మి ‘శాంతి’ మంత్రం