రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం సీబీఐతో విచారణ జరపాలన్న కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదంత ముఖ్యమైన విషయమా..? అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు సైతం విచారిస్తామని, ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రఘురామకృష్ణ రాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన తనయుడు భరత్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్లపై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
అంతేకాకుండా మరో రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గత సంవత్సరం మే నెలలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యాలు చేశారనే ఆరోపణలతో ఆయనను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.