GHMC Debts: బల్దియా అప్పులను టేకోవర్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Debts: హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)పై ఉన్న భారీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీపై ప్రస్తుతం సుమారు రూ. 4,780 కోట్ల అప్పులు ఉండగా, వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. అప్పులను ఎలా పంచుకోవాలనే అంశంపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లకు అప్పులను పంచితే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి, మొత్తం అప్పు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
Team India: “13 క్యాచ్‌లు మిస్”.. టీమిండియాకు మాజీ వికెట్ కీపర్ హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే ఇంటికే!
Also Read
2014 నుంచి హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, కొత్త డ్రైనేజీ నాళాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి బల్దియా సుమారు రూ. 7 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. ఈ అప్పులపై గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల సుమారు రూ. 100 కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తూ జీహెచ్ఎంసీ భారీ ఆర్థిక భారం భరిస్తోంది. ఇక మరోవైపు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన సుమారు రూ. 2,500 కోట్ల మ్యుటేషన్ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌లు కూడా జీహెచ్ఎంసీకి చాలా కాలంగా బకాయిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బల్దియా అప్పులను స్వీకరించి తీర్చినట్లయితే.. భవిష్యత్తులో ఏర్పడే మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నగర అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!