కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించేది లేదన్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని పిటిషనర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు … హోలీ సెలవుల అనంతరం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది… కాగా, హిజాబ్ పై కర్నాటక హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలు అయ్యాయి.
Read Also: YS Jagan: 10.82 లక్షల మంది ఖాతాల్లోకి నగదు బదిలీ చేసిన సీఎం..
అయితే, మాకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరగా.. పరీక్షల కారణంగా విచారణ అత్యవసరమని న్యాయవాది కోరారు.. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సుప్రీంకోర్టు ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు.. పరీక్షలు వస్తున్నందున అత్యవసరమని అన్నారు. కాగా, హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ అంశాన్ని జాబితా చేస్తామని తెలిపింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో చాలా మంది బాలికలు ప్రభావితమవుతారని న్యాయవాది హెగ్డే చెప్పారు. ఇక, ఇతరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.. చూద్దాం అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.. అయితే, న్యాయవాది హెగ్డే పరీక్ష అంశాన్ని లేవనెత్తిన తర్వాత, క్షమించండి, మాకు సమయం ఇవ్వండి.. చూస్తాం అన్నారు.