ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకారం తెలిపింది సుప్రీంకోర్టు… ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు… గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా… కాగా, ప్రజాప్రతినిధులపై కేసుల వ్యవహారంలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నారు విజయ్ హన్సారియా.. ఇక, వివిధ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే..