నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్‌గా ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అధికారంలో ఉన్న పార్టీ.. ఏ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి.. దీంతో.. అధిష్టానం ఆదేశాలతో తన పదవికి రాజీనామా చేశారు సిద్ధూ.. మరోవైపు.. సిద్ధూను ఓ పాత కేసు వెంటాడుతోంది… 34 ఏళ్ల నాటి కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూను కేవలంలో రూ. 1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.. రివ్యూ పిటిషన్‌పై విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ పిటిషన్‌ను శుక్రవారం మరోసారి జాబితాలో ఉంచనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Astrology: మార్చి 22, మంగళవారం దినఫలాలు
కాగా, 1988 డిసెంబరు 27వ తేదీన పాటియాలో పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సాధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. గుర్నామ్ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగిన సిద్ధూ-రూపిందర్ సింగ్‌లు దాడి చేశారు… ఇక, గుర్నామ్ సింగ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించాడని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో సిద్ధూను నిర్దోషిగా పేర్కొన్న పంజాబ్-హర్యానా హైకోర్టు.. రూ.1000 జరిమానా విధిస్తూ 2018 మేలో తీర్పు వెలువరించింది.. దీనిని హత్య కేసుగా చూడలేమని, దేశంలో రోడ్డు పక్కన ఘర్షణలు చాలా సాధారణమైన విషయమని ఈ సందర్భంగా పేర్కొంది. అయిటే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2018 సెప్టెంబర్‌లో గుర్నామ్ సింగ్ కుటుంబం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది.. మరి తదుపరి విచారణ ఎలా జరుగుతుంది.. సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.