టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి భీమిరెడ్డి శ్రీసుధతో గతంలో అతడు సహజీవనం చేయగా ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. Read Also: లతా…
కరోనా నేపథ్యంలో గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్లపై…
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోర్టులు గతేడాది 144 మంది నేరస్థులకు మరణ శిక్షలను ఖరారు చేశాయి. అప్పటికే మరణశిక్షలు పడి, అమలు పెండింగ్ లో ఉన్నవారందరిని కలిపి చూస్తే.. 2021 చివరికి మొత్తం 488 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ విడుదల చేసింది. ప్రతి ఏటా గణాంకాలను విడుదల చేస్తుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెషన్స్ కోర్టులు 2021లో 34 మందికి మరణ శిక్షలను ఖరారు చేశాయి. గతేడాది ఎక్కువ మందికి…
సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించిన సంగతి తెల్సిందే.. ఈ ఎన్కౌంటర్ పై అప్పట్లో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కమిషన్ 47 రోజుల్లో 57 మంది సాక్షులను విచారించి నివేదికను రూపొందించింది. కమిషన్ విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టు మార్టం వివేదికలు, ఫోటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్తో పాటు వివిధ డాక్యుమెంటరీలను ఈ కమిషన్ సేకరించింది. కాగా దిశ ఎన్కౌంటర్లో 19-2019 క్రైమ్…
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు…
ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో…
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్…
భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్ ఎఫెక్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల…
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…