న్యాయస్థానాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమకు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నారని.. ఇది దురదృష్టకర పరిణామం అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరించేవి అని ఆయన గుర్తుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఆమన్‌కుమార్‌పై నమోదైన కేసును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడంతో సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘మీరు సీనియర్ న్యాయవాది.. ప్రభుత్వం కోర్టును దూషిస్తోంది. ఈ కొత్త పోకడ గురించి మాకంటే మీకే బాగా తెలుసు.. ఇది చాలా దురదృష్టకర పరిణామం’ అని పేర్కొన్నారు.
https://ntvtelugu.com/covid-19-booster-dose-for-all-above-18-years-at-private-hospitals-from-april-10th/