‘గంగూబాయ్ కథియావాడి’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు వీగిపోయింది. గంగూబాయి పెంపుడు కొడుకునంటూ షా అనే వ్యక్తి చేసిన అభ్యర్థనను సుప్రీమ్ కోర్టు గురువారం తిరస్కరించింది. తన తల్లి గౌరవానికి భంగం కలిగించేలా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయని, దాని విడుదలపై స్టే ఇవ్వాలని, లేదంటే పేరు మార్చాలని కోరిన షా వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. చిత్ర దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తరఫున కోర్టులో లాయర్ ఎ. సుందరమ్…
కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్యావ్యవస్థలో గందరగోళానికి గురిచేస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా సీబీఎస్ఈ పరీక్షలతో పాటు టెన్త్, ఇంటర్…
జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాలను ఆధారంగా వెతుకుతున్న క్రమంలో డిజిటల్ కార్పొరేషన్లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్ పెట్టిన కేసులో మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం జడ్డీలను దూషించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసులో న్యాయవాది…
హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు. అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి అయిన శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయం తెల్సిందే. తనకు న్యాయం చేయాలంటూ సుధ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే. ఇక ఈ కేసులో శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనకు బెయిల్…
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి భీమిరెడ్డి శ్రీసుధతో గతంలో అతడు సహజీవనం చేయగా ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. Read Also: లతా…
కరోనా నేపథ్యంలో గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్లపై…
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోర్టులు గతేడాది 144 మంది నేరస్థులకు మరణ శిక్షలను ఖరారు చేశాయి. అప్పటికే మరణశిక్షలు పడి, అమలు పెండింగ్ లో ఉన్నవారందరిని కలిపి చూస్తే.. 2021 చివరికి మొత్తం 488 మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ విడుదల చేసింది. ప్రతి ఏటా గణాంకాలను విడుదల చేస్తుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెషన్స్ కోర్టులు 2021లో 34 మందికి మరణ శిక్షలను ఖరారు చేశాయి. గతేడాది ఎక్కువ మందికి…
సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించిన సంగతి తెల్సిందే.. ఈ ఎన్కౌంటర్ పై అప్పట్లో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కమిషన్ 47 రోజుల్లో 57 మంది సాక్షులను విచారించి నివేదికను రూపొందించింది. కమిషన్ విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టు మార్టం వివేదికలు, ఫోటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్తో పాటు వివిధ డాక్యుమెంటరీలను ఈ కమిషన్ సేకరించింది. కాగా దిశ ఎన్కౌంటర్లో 19-2019 క్రైమ్…
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు…