KTR: అలా చేసినట్లయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసి నది శుద్ధి, నగరాభివృద్ధి, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసి నదిని శుభ్రపరచడం కోసం తమ ప్రభుత్వం ఉన్న సమయంలో 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. మూసిలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు.
Also Read
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
శుద్ధి చేసిన నీటిని నిర్మాణరంగానికి ఉపయోగపడే విధంగా తయారు చేసినట్లు వివరించారు. రెండో దశలో కాలేశ్వరం నీటిని మూసిలో ప్రవహింపజేయాలనే ప్రణాళిక కూడా ఉందని వెల్లడించారు. మూసి సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే పేదల ఇళ్లను కూల్చకుండా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. మూసి పేరుతో ఎలాంటి అవినీతి జరిగితే బీఆర్ఎస్ అడ్డుకుంటుందని హెచ్చరించారు.
Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు అయినా నిర్మించినట్లు చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో వారు గట్టిగా స్పందిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో పేదల గొంతుకగా ప్రభుత్వ విధానాలను ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వం పాలన చేయలేకపోతే తప్పుకోవాలని, మంచి పాలన ఎలా ఉండాలో తాము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..