భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం…
తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జి విచారణకు అప్పగించాలన్న బీజేపీ పిటిషన్ నేడు ఢిల్లీకి చేరింది.
ముగ్గురు ఆర్మీ జవాన్లను చంపిన సంచలనాత్మక 2000 ఎర్రకోట దాడి కేసులో తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన…
Supreme Court to hear Gyanvapi mosque case on November 10: జ్ఞానవాపీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనుంది. నవంబర్ 10న ఈ అంశం సుప్రీం ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారిస్తోంది. వీడియో సర్వేలో జ్ఞానవాపీ మసీదులో లభించిన శివలింగాన్ని పరిరక్షించాలని మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఆదేశాల తరువాత మళ్లీ ఇప్పుడే సుప్రీంకోర్టు…
ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
Two-Finger Test Ban: అత్యాచార నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. టెక్నాలజీ ఎంతపెరిగినా ఇంకా డాక్టర్లు అత్యాచార బాధితులను పరీక్షించేందుకు 'రెండు వేళ్ల పరీక్ష' విధానం పాటించడం దురదృష్టకరమని అత్యున్నత న్యాయస్థానం భావించింది.
రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది భారత రాజ్యాంగంలోని విలువలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ సర్కారు తీసుకున్న బాణాసంచా నిషేధం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరం విచారించాలన్న డిమాండ్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
Muslim Girl: మైనర్ ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.