భారతదేశంలో ఎవరినైనా ప్రేమించడం, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్లే వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. నిన్న జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అత్యున్నత న్యాయస్థానం.. అయితే, బెయిల్ షరతులపై కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ…
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బిల్కిస్ బానో అత్యాచారం కేసులోొ 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బాధితురాలు బిల్కిస్ బానో. ఇదిలా ఉంటే బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది తప్పుకున్నారు.
ముస్లిం యువతుల వివాహానికి కనీస వయస్సును ఇతర మతాలకు చెందిన వారితో సమానంగా చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కేంద్రం స్పందించాలని కోరింది.
Supreme Court: పరిహారం ఇప్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లితే అక్కడ కోర్టు అతడికి మొట్టికాయలు వేసింది. యూట్యూబులో వచ్చే లైంగిక యాడ్స్ కారణంగా తను పోటీ పరీక్షల్లో నెగ్గలేకపోయానంటూ.. తనకు న్యాయం చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
National Wise Pending Cases: దేశంలోని అన్ని కోర్టుల్లో రోజురోజుకు పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.