ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
Two-Finger Test Ban: అత్యాచార నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. టెక్నాలజీ ఎంతపెరిగినా ఇంకా డాక్టర్లు అత్యాచార బాధితులను పరీక్షించేందుకు 'రెండు వేళ్ల పరీక్ష' విధానం పాటించడం దురదృష్టకరమని అత్యున్నత న్యాయస్థానం భావించింది.
రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది భారత రాజ్యాంగంలోని విలువలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ సర్కారు తీసుకున్న బాణాసంచా నిషేధం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అత్యవసరం విచారించాలన్న డిమాండ్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
Muslim Girl: మైనర్ ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) వేసిన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు అయ్యారు.. ఇటీవలే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్… జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది… ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు.. దీంతో, నవంబర్ 9న జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 50వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.. రెండేళ్ల పాటు ఆయన పదవీ కొనసాగి.. 2024,…
ప్రత్యక్ష సాక్షుల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే హత్యాయుధం రికవరీ చేయనప్పటికీ, హత్య కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Supreme Court Rejects Urgent Hearing of Pleas Over Political Freebies: ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలు వాగ్ధానం చేసే ఉచితాలపై అత్యవసర విచారణ జపరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఉచితాలపై అత్యవసరంగా విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు శుక్రవారం తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, న్యాయమూర్తి హేమంత్ గుప్తాతో కూడిన దర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది.