Everyone in India has right to choose their God, says Supreme Court: భారతదేశంలో ప్రతీ ఒక్కరికి వారి ఇష్ట ప్రకారం దేవుడిని ఎంచుకుని హక్కు ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ ఆధ్యాత్మిక వ్యక్తిని పరమాత్మగా, సర్వోన్నత వ్యక్తిగా ప్రకటించాలని కోరతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. భారతదేశం లౌకికదేశం అని.. భారత పౌరులు శ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్రను పరమాత్మగా అంగీకరించాలని వేసిన కేసులను సుప్రీంకోర్టు అనుమతించలేదు. న్యామయూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: Minister KTR : చెరువు మాయమైందంటూ మంత్రికి ట్వీట్.. అక్కడికెళ్లి చూసి అవాక్కైన అధికారులు
ఈ పిటిషన్ దాఖలు చేసి పిటిషనర్ ఉపేంద్ర నాథ్ దలైకి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. నాలుగు వారాల్లో పెనాల్టీని డిపాజిట్ చేయాలని కోర్టు దలైని ఆదేశించింది. మరోసారి ప్రజలు ఇలాంటి పిటిషన్ దాఖలు చేసేందుకు నాలుగు సార్లు ఆలోచిస్తారంటూ వ్యాఖ్యలు చేసింది.
మీకు కావాలంటే మీరు అతడిని పరమాత్మగా పరిగణించవచ్చు. ఇతరులు ఎందుకు పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీ ఉపన్యాసం వినేందుకు ఇక్కడ లేము.. మనది సెక్యులర్ దేశం అంటూ సుప్రీంకోర్టు పిటిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరూ మీ దేవుడిని అంగీకరించాలని మీరు అనుకుంటున్నారు.. అది ఎలా అవుతుంది.. భారతదేశంలో ప్రతీ ఒక్కరికి వారి మతాన్ని, వారి దేవుడిని ఎంచుకునే హక్క ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.