YS Viveka Case: వివేకా హత్య కేసులో న్యాయం జరగాలి.. ఎక్కడ విచారణ జరిగినా అభ్యంతరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని వైఎస్ జగన్ కుటుంబం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ విషయంపై స్పందించిన ఆయన.. ఏపీలో ఫ్రీ అండ్ ఫేర్ విచారణ జరగడం లేదని వారు అంటున్నారు.. ట్రయల్ ఎక్కడ జరిగినా మాకు అభ్యంతరం లేదన్నారు.. ఇక్కడ ఏదైనా ఇన్ ఫ్లుయన్స్ జరుగుతుందని భావిస్తే అక్కడ జరిగినా మంచిదే అన్నారు.. దర్యాప్తు తెలంగాణలో జరిగినా మంచిదే.. న్యాయం జరగాలన్నదే మా ఆలోచనగా చెప్పుకొచ్చారు.. తెలంగాణలో విచారణ జరిగినా మేం అభ్యంతరం చెప్పడం లేదు.. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలన్నదే మా కోరిక అన్నారు సజ్జల.
Read Also: YS Sharmila: షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ఇక, చంద్రబాబులా రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టడానికి లేదు అనే విధానం మాది కాదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరు, దర్యాప్తు అధికారులకు రాజకీయ బెదిరింపులు, వివేకా కుమార్తె విజ్ఞప్తి వంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది.. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఏపీ నుంచి ఈ కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. తెలంగాణ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిన ఈ కేసును ఇప్పటివరకూ ఏపీలో కడప, పులివెందులకోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!