న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావడం చాలా అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
Gay Couple Moves Supreme Court Seeking Recognition Of same gender marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని.. తమ వివాహాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఓ స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టుకెక్కింది. లెస్బియన్ కమ్యూనిటి LGBTQ+కి చెందిన సభ్యులు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అనుమతించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడాన్ని పిటిషనర్ లేవనెత్తాడు. తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రాథమిక హక్కులను అమలు చేయాలని…
అరుణ్ గోయల్ను ఎన్నికల కమిషనర్గా నియామకం ఎందుకంత వేగంగా చేపట్టాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను వేగంగా ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్ గోయల్ నియామక దస్త్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం హడావుడిగా ఆయనను ఈసీగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
కోరేగావ్-భీమా కేసులో 2020 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 70 ఏళ్ల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది.