BBC Documentary On PM Modi: 2002 గుజరాత్ అల్లర్లపై, ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై ప్రముఖ మీడియా బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధాని మోదీపై బీబీసీ సిరీస్ ను తప్పు పట్టింది భారత ప్రభుత్వం. ఇది పక్షపాతంతో కూడిన ప్రచారం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం ప్రచారమే అని.. పక్షపాతం అని విమర్శించింది. బీబీసీ వలసవాద మనస్తత్వంతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఇటువంటి డాక్యుమెంటరీలను గౌరవించలేమని విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
‘‘ఇండియా: మోడీ క్వశ్చన్’’పేరుతో ప్రధాని మోదీపై బీబీసీ రెండు భాగాల సిరీస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, 1000 మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం.
Read Also: Wolf Attack: ఏడాదిన్నర బిడ్డపై దాడి చేసి చంపిన తోడేలు..
2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు.
ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారు. తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.