BBC Documentary On PM Modi: 2002 గుజరాత్ అల్లర్లపై, ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై ప్రముఖ మీడియా బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధాని మోదీపై బీబీసీ సిరీస్ ను తప్పు పట్టింది భారత ప్రభుత్వం. ఇది పక్షపాతంతో కూడిన ప్రచారం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం ప్రచారమే అని.. పక్షపాతం అని విమర్శించింది. బీబీసీ వలసవాద మనస్తత్వంతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఇటువంటి డాక్యుమెంటరీలను గౌరవించలేమని విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి…
లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. వివాదాస్పద జీవో నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా ఈ…
Central Government: భర్తను భార్య రేప్ చేయడమేంటి.. భార్యను భర్త రేప్ చేయడమేంటి.. అసలు ఏంటి ఇదంతా.. సమాజం ఎటువెళ్తోంది.. టైటిల్ చూడగానే ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఇవే అనుమానాలు వ్యతమవుతున్నాయి. ఒక మహిళకు ఇష్టం లేకుండా ఏ మగాడు.. ఆఖరికి భర్త కూడా ముట్టుకోవడానికి వీలు లేదు.
Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది దేశ…
కాళీ దేవత సిగరెట్ తాగుతున్నట్లు చూపుతున్న తన రాబోయే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన బహుళ ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని, రద్దు చేయాలని కోరుతూ చిత్రనిర్మాత లీనా మణిమేకలై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గత ఏడాది టీవీ చర్చలో ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిరసనలు, హింసకు కారణమై పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇప్పుడు తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారు.
Minor Moves Delhi High Court For Termination Of 16-Week Pregnancy: తన గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్ల మైనర్ తన తల్లి సహాయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ అయిన బాలిక, మరో మైనర్ బాలుడు లైంగిక చర్య ద్వారా గర్భాన్ని దాల్చింది. దీంతో వైద్యపరంగా తన గర్భాన్ని రద్దు చేయాలని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. బాలిక, బాలుడు ఏకాభిప్రాయం ద్వారా లైంగిక చర్యలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం…
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జనవరి 16న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జోషిమఠ్‌లో భూమి క్షీణించడం వల్ల పెను సవాలు ఎదురవుతోంది.
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.