Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
Supreme Court: థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.…
ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది.
Supreme Court Upholds Centre's Note Ban Move: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడతూ మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటిని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని చెప్పింది.
Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది.…
భారతదేశంలో ఎవరినైనా ప్రేమించడం, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్లే వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.