America Justice Department Sues Google: పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ.. గూగుల్‌పై భారత్‌లో ఇప్పటికే కొరడా పడిన విషయం తెలిసిందే! ఇప్పుడు అమెరికాలోనూ దీనికి చిక్కులు మొదలయ్యాయి. అక్కడి జస్టిస్ డిపార్ట్‌మెంట్ గూగుల్ ఆన్‌లైన్ యాడ్ మార్కెట్ విధానాలను తప్పుబట్టింది. ఎనిమిది రాష్ట్రాలతో కలిసి కోర్టులో దావా కూడా వేసింది. ఆన్‌లైన్ యాడ్ మార్కెట్‌లో ప్రత్యర్థులను తొలగించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని తన దావాలో పేర్కొంది. పోటీ సంస్థలను కొనుగోలు చేయడం ద్వారానో లేక వారి ఉత్పత్తులను వినియోగించే ప్రక్రియను కస్టమర్లకు కష్టతరం చేయడం ద్వారా.. తన బాధ్యతాయుతమైన పాత్రను గూగుల్ దుర్వినియోగం చేస్తోందని పేర్కొంది.
Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?
నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్టైజింగ్‌లో గూగుల్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించేందుకు.. ఆ సంస్థపై అమెరికా ప్రభుత్వం కేసు పెట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛా మార్కెట్ విధానాలపైనే ఆధారపడి ఉందని.. కానీ, గూగుల్ గుత్తాధిపత్యం వల్ల అది దెబ్బతింటోందని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ పేర్కొన్నారు. ఇలాంటి లోపభూయిష్ఠ విధానాలు ఆవిష్కరణలను అణచివేస్తాయని.. ఉత్పత్తిదారులు, కార్మికులను అధిక ధరలు ఇబ్బందులకు గురిచేస్తాయని అన్నారు. గత 15 ఏళ్ల నుంచి గూగుల్ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని.. ఫలితంగా ప్రత్యర్థి టెక్నాలజీల పురోగతిని నిలువరించిందని ఆయన ఆరోపించారు. ప్రకటనదారులు, పబ్లిషర్లు మాత్రమే తమ ఉత్పత్తులు వినియోగించేలా ఆన్‌లైన్ విధానాలను ఈ గూగుల్ సంస్థ తారుమారు చేసిందని ఆయన వెల్లడించారు.
Kishan Reddy: తెలంగాణ రిపబ్లిక్ డే వివాదం.. కేసీఆర్‌పై కిరణ్ రెడ్డి ఫైర్
ఇటు భారత్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలకు సంబంధించి, పోటీ చట్టాలకు విరుద్ధంగా తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ ఏకంగా రూ.1337 కోట్ల అపరాధ రుసుము విధించింది. దీనికి కౌంటర్‌గా గూగుల్ ఎన్‌సీఎల్‌ఏటీను ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదులు అయ్యింది. దీంతో గూగుల్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే.. అక్కడ సైతం గూగుల్‌కి ప్రతికూల తీర్పే వచ్చింది. అపరాధ రుసుముపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. దీన్నుంచి ఎలా బయటపడాలా? అని తర్జనభర్జన అవుతున్న తరుణంలో.. ఇప్పుడు అమెరికాలోనూ గూగుల్‌కి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి.
Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్