తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబీకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఖలందర్ నగర్‌లో చోటు చేసుకుంది.
Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది.…
Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది..?’’ అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిందిన పోలీసులు మంగళవారం తెలిపారు.
ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు... కారణమేదైనా కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. దేశంలో రోజు రోజుకూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బలవన్మరణాలకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఒత్తిడి భరించలేకపోవడం కారణంగా ఉన్నాయి. తాజాగా నోయిడాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. నోయిడాలో ఒక మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ ఫొటోలతో మామ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో మహిళా టెక్కీ ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. థర్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు.. కుమారుడు శవమై కనిపించాడు.
Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (మం) బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం హరిత రిసార్ట్‌కు వచ్చిన ప్రేమజంట.. ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే.. రాత్రి పూట ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, ఉదయం రూమ్ క్లినింగ్‌కి సిబ్బంది వెళ్ళగా ప్రేమికులు ఉరివేసుకుని కనిపించారు.