Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్‌నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని అబిడ్స్ పరిధిలో ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై కారు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు నాంపల్లి ఆండాళమ్మ బస్తీకి చెందిన సునీతగా అధికారులు గుర్తించారు. ఆమె గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ బ్యాంకులో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని నిన్న సాయంత్రం(ఆగస్టు 12) చాపెల్ రోడ్డు గుండా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మహానంద కారును వేగంగా తీసుకొచ్చి సునీతపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలని కారు యజమాని, సినీ నిర్మాత బొమ్మకు మురళికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన తీవ్ర నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానమిస్తూ “కారు నాదే, కానీ నేను పైసా కూడా ఇవ్వను.. కావాలంటే ప్రమాదం చేసిన డ్రైవర్‌నే చంపుకోండి” అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన బొమ్మకు మురళి, ఒక టెక్నోక్రాట్, సామాజిక, రాజకీయ కార్యకర్త నుంచి ఆ తర్వాత సినిమా నిర్మాతగా మారారు. “శరణం గచ్ఛామి” ఆయన మొదటి సినిమా. తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం భారత రాజ్యాంగం, రిజర్వేషన్ల వ్యవస్థ అనే అంశాన్ని చర్చిస్తుంది.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!