Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి.
డాక్టర్ అజయ్ కుమార్ జోధ్‌పూర్ లోని కీర్తి నగరంలో ఉన్న తన క్లినిక్ లో ఉరి వేసుకుని కనిపించాడు. అతను కాల్స్ కి స్పందచక పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు. దీంతో, ఒక తెలిసిన వ్యక్తి క్లినిక్ కు వెళ్లి చూడా ఉరి వేసుకొని ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అజయ్ తన సుసైడ్ నోట్ లో తన భార్య సుమన్ పై మానసిక హింస చేసిందని పేర్కొన్నదని తెలిపారు. ఆ నోట్‌లో తన పోరాటాన్ని, నిరాశను వ్యక్తం చేశాడు.
Also Read: Allu Arjun : పొరపాటున సుకుమార్ అసలు పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్..సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
డాక్టర్ అజయ్, సుమన్ లకు 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి నాలుగు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ పిల్లవాడు సుమన్ తో కలిసి జైపూర్ లో ఉన్నాడు. అజయ్ కుమార్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, సుమన్ అజయ్ ను చాలా కాలం నుంచి మానసికంగా వేధించిందని, ఇది ఆయన జీవితంలో తీవ్ర ఒత్తిడిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సంఘటన ఇటీవల బెంగళూరు లో జరిగిన అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును మళ్లీ గుర్తు చేస్తోంది. అటుల్ సుభాష్ కూడా తన భార్యపై పెళ్లి, విడాకుల మరియు కస్టడీ వివాదాల కారణంగా వేధింపులు జరిగినట్టు తెలిపి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసు అధికారులు ఈ సంఘటనపై కేసును నమోదు చేసి, డాక్టర్ అజయ్ కుమార్ శవం పోస్టుమార్టం కోసం మహాత్మా గాంధీ ఆస్పత్రికి పంపారు. ఆయన కుటుంబ సభ్యులు రాగా శవాన్ని వారికి అప్పగించనున్నారు. పోలీసు అధికారులు సుసైడ్ నోట్, కుటుంబ సంబంధాల వివాదాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని కేసు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.