నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
- పిక్సల్ బడ్స్ 2a, పిక్సల్ బడ్స్ ప్రో 2కు గూగుల్ కొత్త ఫీచర్లు..
- ఇయర్‌బడ్ ఫిట్ మారినప్పటికీ నాయిస్ క్యాన్సిలేషన్‌ను రియల్‌టైమ్‌లో ఆటోమేటిక్‌గా సర్దుబాటు
- యూజర్ నిద్రలోకి వెళ్లినట్లు గుర్తిస్తే పిక్సల్ బడ్స్‌లో ప్లే అవుతున్న ఆడియో ఆటోమేటిక్‌గా పాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel Buds 2a, Pro 2: గూగుల్ (Google) పిక్సల్ ఎకోసిస్టమ్ లో భాగంగా పిక్సల్ బడ్స్ 2a (Pixel Buds 2a), పిక్సల్ బడ్స్ ప్రో 2 (Pixel Buds Pro 2) ఇయర్‌బడ్స్‌కు కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లను తీసుకవచ్చింది. కొత్త ప్రొడక్ట్స్‌ను విడుదల చేయకుండా ఇప్పటికే ఉన్న ఇయర్‌బడ్స్‌కు మరికొన్ని ఫీచర్లను జోడిస్తోంది. ఇంకా పిక్సల్ బడ్స్ ప్రో 2ను కొత్త ఆలివ్ “Olive” కలర్ ఆప్షన్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
డైనమిక్ ANC:
కొత్త అప్డేట్లో భాగంగా పిక్సల్ బడ్స్ ప్రో 2కు “డైనమిక్ ANC అడ్జస్ట్మెంట్స్” ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఇయర్‌బడ్స్ ధరించి కదులుతున్నప్పుడు చెవిలో దాని ఫిట్ లేదా సీల్లో స్వల్ప మార్పులు రావచ్చు. దీంతో “ఆక్టివ్ నాయిస్ కాన్సలేషన్ (ANC)” పనితీరులో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు కొత్త ఫీచర్ రియల్‌టైమ్‌లో నాయిస్ ఐసోలేషన్‌లో వచ్చే మార్పులను గుర్తించి ANC ప్రాసెసింగ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీంతో ఇయర్‌బడ్స్ ఫిట్ మారినప్పటికీ స్థిరమైన నాయిస్ క్యాన్సిలేషన్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది.
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
వాయిస్ కమాండ్స్:
పిక్సల్ బడ్స్‌లో “జెమినీ” ఇంటిగ్రేషన్‌ను కూడా మరింత పెంచారు. ఇకపై కొన్ని ఇయర్‌బడ్ సెట్టింగ్స్‌ను చేతులతో తాకకుండా జెమినీ వాయిస్ కమాండ్స్ ద్వారా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మ్యూజిక్ వింటున్నప్పుడు బాస్‌ను పెంచాలని జెమినీని అడిగితే ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. దీంతో ఇయర్‌బడ్స్‌ను మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
నిద్రపోతే ఆటోమేటిక్‌గా..
పిక్సల్ వాచ్ తో పిక్సల్ బడ్స్ మధ్య క్రాస్-డివైజ్ ఇంటిగ్రేషన్‌ను కూడా గూగుల్ మెరుగుపరుస్తోంది. పిక్సల్ వాచ్ యూజర్ నిద్రలోకి జారుకున్నట్లు గుర్తించినప్పుడు పిక్సల్ బడ్స్ లో ప్లే అవుతున్న ఆడియోను ఆటోమేటిక్‌గా పాజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇయర్‌బడ్స్ టచ్ కంట్రోల్స్‌ను కూడా డిసేబుల్ చేస్తుంది. దీంతో నిద్రలో అనుకోకుండా ఇయర్‌బడ్‌ను తాకడం వల్ల మ్యూజిక్ లేదా ఇతర కంటెంట్ ప్లే అయ్యే అవకాశం ఉండదు. అదే సమయంలో వచ్చే నోటిఫికేషన్లను కూడా మ్యూట్ చేస్తుంది.
Olive కలర్:
కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లతో పాటు పిక్సల్ బడ్స్ ప్రో 2కు కొత్త “ఆలివ్” కలర్ వేరియంట్‌ను గూగుల్ తీసుకవచ్చింది. ఈ కొత్త కలర్ ఆప్షన్‌కు ఆగస్టు 12 నుంచి ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ రెండు డివైస్ లకు సంబంధించిన కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్ల రోల్అవుట్ 2026 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. అనుకూలమైన పిక్సల్ బడ్స్ డివైజ్‌లకు ఈ అప్డేట్ దశలవారీగా అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!