బెంగళూరులోని ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు కేసు మరవక ముందే మరో కేసు బయటకు వచ్చింది. అతుల్ సుభాస్ మాదిరిగానే ఓ వ్యక్తి తన భార్య తనను వేధిస్తోందని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో 37 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు తన భార్యతో పాటు మరో వ్యక్తి వేధిస్తున్నారని ఆరోపిస్తూ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మొబైల్ ఫోన్ నుంచి వీడియో స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: DK Shivakumar: రాబోయే సమావేశంలో దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వ్యూహరచన..
ఈ ఘటన గురువారం జరిగింది. నాలుగు నిమిషాల వీడియోలో తన భార్య, మరో వ్యక్తి తనను మానసికంగా హింసిస్తున్నట్లు ఆ వ్యక్తి పేర్కొన్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ రాయ్ తెలిపారు. తనను వేధిస్తున్న వ్యక్తి తన భార్యపై అత్యాచారం చేసినట్లు వీడియోలో ఆరోపించాడు. తన భార్యతో కలిసి తాను జీవించాలని కోరుటున్నట్లు చెప్పాడు. కానీ.. ఆమె దానికి ఒప్పుకోలేదని.. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
READ MORE: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. తన మామ ఇంటికి కొడుకు, కూతురు
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 09న బెంగళూర్‌లో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు 24 పేజీల లేఖ, గంటకు పైగా ఉన్న వీడియో రికార్డ్ చేశారు. వీడియోలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. తన భార్య తనను తప్పుడు కేసుల్లో ఇరికించిందని, చివరకు న్యాయమూర్తి కూడా లంచం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. ఈ కేసులో అతుల్ భార్య నిఖితా సింఘానియాతో పాటు తల్లి నిషా సింఘానియి, సోదరుడు అనురాగ్ సింఘానియాను డిసెంబర్ 16న అరెస్ట్ చేశారు. ముగ్గురిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు.