పని భారం, అధికారుల వేధింపులు భరించలేక ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోను ద్వారా స్వామికి సమాచారం అందిస్తున్నారు. విధులకు రాకపోతే…
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రత్యూష బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్ సమీపంలో బొటిక్ నిర్వహిస్తున్నారు. ఆమె శనివారం తన బోటిక్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రత్యూష తండ్రి కృష్ణారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా…
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పబ్జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఓడిపోయావని తోటి పిల్లలు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 ఏళ్ల బాలుడికి ఫోన్‌లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే ఈసారి గేమ్‌లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే…
దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలే హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. షాపింగ్ కు తీసుకెళ్ల లేదని.. చీర కొనివ్వ లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పదేపదే పనికి వెళ్లు అని భర్తను విసిగించడంతో భార్యను దారుణంగా హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్ పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనికి వెళ్లమని భార్య అడిగినందుకు…
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ షురూ అయ్యాయి. ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ పాన్ కార్డ్ వుంటే చాలంటూ అమాయకులకు ఎరవేస్తున్నారు. వారిఎరలో పడ్డవారికి వేధింపులకు గురిచేస్తున్నారు. యాప్‌ల ద్వారా లోన్లు తీసుకున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. వారి ఫోటోలపై,…
బెంగాల్ లో మరో విషాదం నెలకొంది. మరో మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. మంజూషా నియోగి అనే మోడల్ కోల్ కతా పటులి ప్రాంతంలో తన నివాసంలో శవమై కనిపించింది. మూడు రోజుల వ్యవధిలో కోల్ కతాలో ఇద్దరు మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల మంజూషా నియోగి ఫ్రెండ్ మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత రెండు రోజుల నుంచి తీవ్రమైన డిప్రెషన్ తో మంజూషా నియోగి బాధపడుతోంది. తన కూతురు డిప్రెషన్ తో…
హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యాయత్నం సంచలంగా మారిన విషయం తెలిసిందే.. బిల్లుల విషయంలో ఓ కాంట్రాక్టర్ మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు బాధితులు. బంధువుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే.. సరూర్ నగర్ కుటుంబ ఆత్మహత్యయత్నం బాధితులు శశికుమార్ భార్య శ్వేతా తన ఆవేదన అధికారులకు వెల్లడించింది. దినేష్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా…
చిత్ర పరిశ్రమలో నటీమణుల వరుస మరణాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.. మొన్నటికి మొన్న టీనా మాస్టర్ గోవాలో అనుమాస్పదంగా మృతి చెందింది.. ఇక అది మరువకముందే నిన్నటికి నిన్న కోలీవుడ్ మోడల్ షహనా బాత్ రూమ్ లో శవంలా కనిపించింది. ఇక ఈ రెండు ఘటనలను ఇంకా మరువక ముందే మరో నటి మృత్యువాత పడింది. ప్రముఖ బెంగాలీ సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకోంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే..…
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ఎదుట రఘురాం అనే పత్తి మిల్లు యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ.. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదివరకు గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన స్పందించలేదని అన్నాడు. దిక్కుతోచని స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వాపోయాడు.…
హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వివాహం జరిగిన పది నెలలకే వరకట్న వేధింపుల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫ్లాట్ నెంబర్ 158లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్‌తో నిఖితకు వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 10 లక్షల నగదుతో పాటు 35 తులాల బంగారాన్ని నిఖిత…