ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రత్యూష బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్ సమీపంలో బొటిక్ నిర్వహిస్తున్నారు.
ఆమె శనివారం తన బోటిక్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రత్యూష తండ్రి కృష్ణారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. బొటిక్ వాచ్‌మెన్ వీరబాబును పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆమె గదిలోకి వెళ్లిందని, తనను డిస్టర్బ్ చేయవద్దని చెప్పిందని వీరబాబు తెలిపాడు.
నొప్పిలేకుండా ప్రాణం తీసుకోవటమెలా?
కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న ప్రత్యూష, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మానసిక ఒత్తిడిని తగ్గించుకొనేందుకు ఆమె మందులు వాడుతున్నట్టు విచారణలో తేలింది. శుక్రవారం సాయంత్రం గదిలోకి వెళ్లిన తర్వాత ఆమె కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వారం క్రితమే ఓ కార్పెంటర్‌ను పిలిచి బొటిక్‌లోని బాత్‌రూమ్ వెంటిలేటర్లను మూసేయించినట్టు తేలింది.
దీనినిబట్టి ఆమె ఆత్మహత్యకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొన్నట్టు భావిస్తున్నారు. నొప్పిలేకుండా ప్రాణం తీసుకోవటమెలా? అని కూడా ఇంటర్‌నెట్‌లో వెతికినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరెవరితో మాట్లాడిందనే అంశాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Airtel: గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్..