Loan Apps : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ షురూ అయ్యాయి. ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ పాన్ కార్డ్ వుంటే చాలంటూ అమాయకులకు ఎరవేస్తున్నారు. వారిఎరలో పడ్డవారికి వేధింపులకు గురిచేస్తున్నారు. యాప్‌ల ద్వారా లోన్లు తీసుకున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. వారి ఫోటోలపై, బంధువల ఫోటోలపై నానా మాటలు రాసి షోసల్ మీడియాలో పోస్ట్ లు చేస్తారు. అది భరించని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు.
లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నపురం సాయి గణేష్ కాలనీలో చోటుచేసుకుంది. మహమ్మద్ ఖాజా అనే యువకుడు లోన్ యాప్స్ లో కొంత డబ్బును తీసుకున్నాడు దాంతో అతని వేధింపులు మొదలయ్యాయి. నిరాశచెందిన మహమ్మద్ ఖాజా చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ఇలాంటి దారుణాలు తెలంగాణలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చోటుచేసుకుంది. విజయవాడలోని కొండపల్లికి చెందిన ఓ యువకుడు వివిధ యాప్ల ద్వారా రూ.7.52.024 రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీతో కలిపి రూ. 14.38.107 వరకు కట్టాడు. అయినా.. రుణయాప్లకు సంబంధించిన ఉద్యోగులు ఫోన్ చేసి ఇంకా చెల్లించాల్సి ఉందని వేధించే వారు. అభ్యంతరకరమైన భాషలో మాట్లాడేవారు. యువకుడి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చి వాటిని వాట్సాప్ ద్వారా పంపి బెదిరించేవారు. వీటిని తట్టుకోలేక చివరకు ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
విజయవాడ శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె రూపీ వే, హ్యాండీ లోన్, ఫెయిర్ క్రెడిట్, హనీ లోన్, క్విక్ లోన్, క్యాష్ జీ, యాక్షన్ క్యాష్, క్యాష్ అడ్వాన్స్, తదితర యాప్ల ద్వారా రూ. 55.435 మేర రుణం తీసుకుంది. దీనికి గాను ఆమె రూ. 2 లక్షలు వరకు చెల్లించింది. భేదింపులు తప్పలేదు.
ఇటువంటి వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని . వీటి నుంచి రుణం తీసుకుని, చెల్లించినా వేధింపులకు గురైతే తక్షణమే పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని విజయవాడ సైబర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తెలంగాణ పోలీసు యంత్రాంగం చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేశాం. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67బి కింద కేసు పెట్టాం. రెండేళ్ల తర్వాత ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వేధింపులు లాంటివి ఏమైనా వుంటే పోలీసులకు ఆశ్రయించాలన్నారు.
Chain Snatching: రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు.. ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా..
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!