ప్రేమకు వయస్సుతో సంబంధంలేదు. ఇది మనం తరచూ వినే మాట. ప్రేమలో పడ్డవారు ఎవరి గురించి ఆలోచించరు. ప్రేమలో వున్నవారికి వారు తప్ప మరెవరు కనిపించరు. ఏంచేస్తున్నారో వారికే తెలియదు. ప్రేమలో వుంటే సినిమాలు చూసి తెగింపు వచ్చేస్తుంది. కని పెంచిన తల్లిదండ్రులకంటే ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి, అమ్మాయి పై ప్రేమ అంటూ వెంటబడి వారితో మన జీవితం అంటూ ఫిక్స్ అయిపోతారు. వారు జీవితంలో లేకుంటా బతకలేము అనే ఫీలింగ్ లో వెళతారు. అంతేకాదు వారు దూరమైతే బతకడం కన్నా చావే సరణ్యం అనుకుంటారు. ఇది మన నిజ జీవితంలో చూస్తున్న సినిమా లాంటి జీవితం. ఇక మనం చెప్పుకోవాల్సింది ఓ చిన్నారి ప్రేమకథ. నేటి సినిమాల ప్రభావమా లేక సెల్ ఫోన్ ల మహత్యమో తెలియదు కాని శరీరం, మనస్సు రెండు పరిపక్వత చెందని 14 సంవత్సరాల పిల్లలు, తెలిసి తెలియని వయస్సు లో ప్రేమ అనే వింత పోకడలో మునిగిపోయారు. ఈ ప్రేమను పెద్దలు అంగీకరించక లేదు. దీంతో 9 తరగతి చదువుతున్న 14 సంవత్సరాల అమ్మాయి,అబ్బాయి సుభాష్ నగర్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పేట్ బషీర్ బాద్ పియస్ పరిది లో చోటు చేసుకుంది..
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూజ(14), సురేందర్(14) గత కొంతకాలంగా చనువుగా ఉంటూ ప్రేమగా ఉండేవారు. అమ్మాయి పూజ అయోద్యనగర్ కాగ, అబ్బాయి సురేందర్ సుభాష్ నగర్. వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వీరు మొన్న అదృశ్యమయ్యారు. హుటాహుటిన కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ (మిస్సింగ్) కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేస్తుండగా నేడు సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ చెరువులో పూజ మృతదేహం తెలియాడుతుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పేట్బషీరాబాద్ పియస్ పరిదిలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూజ మృత దేహం వెలికితీసారు. సురేందర్(14) మృతదేహం కోసం పోలీసులు గాలించారు. నిన్న చీకటి పడిపోవడంతో ఈతగాళ్లు వెనుతిరిగారు. ఈ రోజు ఉదయం సురేందర్ మృతదేహం తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.