మాదాపూర్ విఠల్‌రావు నగర్ లోని అలియన్స్ బ్లెండెడ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఆన్గ్మీట్ లెప్చా (39) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. బ్యూటీషన్ గా పనిచేస్తున్న లెప్చా తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి స్వస్థలం డార్జిలింగ్.. ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భర్త తో ఉన్న విభేదాల తోనే మనస్థాపానికి గరై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 27 రోజులకే ఓ నవవధువు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాతబస్తీ కి చెందిన రషీద్, షఫియా ఫాతిమా (21) లకు 27 రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే ఏంజరిగిందో ఏమో తెలియదు గానీ.. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో రషీద్ ఇంట్లో ఫాతిమా మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఈ మేరకు కేసు…
క్షణికావేశం, అర్థం పర్థం లేని వ్యవహారాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తనతో మాట్లాడటం లేదని అత్మహత్యకి పాల్పడ్డాడో యువకుడు. ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న దుర్గేష్ బోయిన్ పల్లిలో ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్లి మహిళ తో పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ళుగా ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా కొంతకాలంగా మాట్లాడడం మానేసిందా మహిళ. మనస్థాపంతో మహిళ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు దుర్గేష్.…
టాలీవుడ్ సింగర్ హరిణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వారం రోజులుగా సింగర్ హరిణి కుటుంబం కనిపించకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతున్న వేళ.. అందరూ షాక్ తినేలా హరిణి తండ్రి ఏకేరావు బెంగూళూరు సమీపంలోని ఓ రైల్వే మృత దేహం లభ్యమైంది. ఏకే రావు సుజన్ ఫౌండేషన్‌లో సీఈవోగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు కనిపించకుండా పోయిన కుటుంబ సభ్యులు ఇప్పడు బెంగుళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో కనిపించారు. అయితే గత వారం రోజులుగా…
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం జరిగింది. రైలుకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిశాకు చెందిన వలస కూలీ సంజయ్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలస కూలీ సంజయ్ కుమార్.. అందరూ చూస్తుండగా ఒక్కసారి ట్రాక్ మీదకు వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మృతుడి మానసిక…
నేటి సమాజంలో కొందరు చిన్నచిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటు వారిని నమ్ముకున్న వారికి తీరని శోకంలో ముంచుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెట్పల్లి మండలం ఆత్మనగర్ కు చెందిన తల్లీకూతుళ్ల వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో నిన్న ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లి వనజ (28), కుమార్తె శాన్వి (6) లు వరద కాలువ దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ రోజు ఉదయం ఆత్మనగర్ వద్ద…
షేక్ పేట లో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు సంతోష్. పాతబస్తీకి చెందిన కళ్యాణి తో మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు సంతోష్. ఆరేళ్ల కుమారుడిని తన దగ్గరికి పంపించకుండా భార్య వేధిస్తోందని సంతోష్ ఆరోపించాడు. ఆన్ లైన్ లో పురుగులమందు ఆర్డర్ తెప్పించుకున్న సంతోష్..చనిపోయే ముందు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు సంతోష్. భార్య, కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు సంతోష్.…
అమీర్‌పేట్ మెట్రోస్టేషన్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువతి అమీర్‌పేట మెట్రో స్టేషన్ రెండవ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి దూకడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న టింబర్ డిపోలో యువతి పడిపోయింది. శబ్దం విన్న స్థానికులు గమనించి వెంటనే యువతి వద్దకు చేరుకున్న పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా 108 వాహనంలో యువతిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన యువతి…
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.. పరువు పోతుందని కుటుంబం మొత్తం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచారు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను పుష్ప…
బార్యభర్తల మధ్య మనస్పర్ధలు సాధారణమే.. కానీ, ఆ చిన్న చిన్న కారణాలనే మనసులో పెట్టుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్య కాపురానికి రానని చెప్పడంతో మనస్థాపానికి గురై రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఉదయ్‌కుమార్(30)కు హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన యువతితో సంవత్సరం క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. ఉదయ్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని, తనతో ఉండడం కుదరదని…