A boyfriend, knowing that his girlfriend was getting married to someone else, tried to commit suicide by pouring kerosene on fire in front of the function hall where the wedding was taking place.
ప్రేమకు వయస్సుతో సంబంధంలేదు. ఇది మనం తరచూ వినే మాట. ప్రేమలో పడ్డవారు ఎవరి గురించి ఆలోచించరు. ప్రేమలో వున్నవారికి వారు తప్ప మరెవరు కనిపించరు. ఏంచేస్తున్నారో వారికే తెలియదు. ప్రేమలో వుంటే సినిమాలు చూసి తెగింపు వచ్చేస్తుంది. కని పెంచిన తల్లిదండ్రులకంటే ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి, అమ్మాయి పై ప్రేమ అంటూ వెంటబడి వారితో మన జీవితం అంటూ ఫిక్స్ అయిపోతారు. వారు జీవితంలో లేకుంటా బతకలేము అనే ఫీలింగ్ లో వెళతారు.…
అమ్మ తిట్టిందనో.. పరీక్ష పాస్ అవ్వలేదనో … ఆర్థిక ఇబ్బందులో.. అక్రమ సంబంధాల వల్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇదే పరిస్థితి. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దాంతో కన్నవాళ్లకు కడుపు కోత మిగులుతుంది. ఈ ఆత్మహత్యల వల్ల కొందరు పిల్లలను కోల్పోతుంటే.. మరికొందరు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది.…
పని భారం, అధికారుల వేధింపులు భరించలేక ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోను ద్వారా స్వామికి సమాచారం అందిస్తున్నారు. విధులకు రాకపోతే…
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న ప్రత్యూష బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్ సమీపంలో బొటిక్ నిర్వహిస్తున్నారు. ఆమె శనివారం తన బోటిక్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రత్యూష తండ్రి కృష్ణారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా…
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పబ్జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఓడిపోయావని తోటి పిల్లలు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 ఏళ్ల బాలుడికి ఫోన్లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే ఈసారి గేమ్లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే…
దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలే హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. షాపింగ్ కు తీసుకెళ్ల లేదని.. చీర కొనివ్వ లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పదేపదే పనికి వెళ్లు అని భర్తను విసిగించడంతో భార్యను దారుణంగా హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్ పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనికి వెళ్లమని భార్య అడిగినందుకు…
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ షురూ అయ్యాయి. ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ పాన్ కార్డ్ వుంటే చాలంటూ అమాయకులకు ఎరవేస్తున్నారు. వారిఎరలో పడ్డవారికి వేధింపులకు గురిచేస్తున్నారు. యాప్ల ద్వారా లోన్లు తీసుకున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. వారి ఫోటోలపై,…