ఈ మధ్య తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, ఓ యువకుడి ఆత్మహత్యకు కారణం అంటూ ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు ములుగు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణం తీసింది. 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్‌వోసీ కోసం పెండ్యాల ప్రశాంత్…
తెలంగాణలో ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల అరాచకాలు రోజుకు ఒకటి తరహాలో బయటపడుతూనే ఉన్నాయి.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు బలి అయ్యాడు.. ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు తట్టుకోలేకు జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్ ఆన్‌లైన్ లోన్ యాప్ నుంచి రూ. 12 వేలు లోన్‌గా తీసుకున్నారు.. ఇప్పటికే ఈఎంఐ ద్వారా రూ.4 వేలు చెల్లించాడు.. అయితే, లోన్ తీసుకునే సమయంలో స్నేహితుల ఫోన్…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల మృతికి కారకులవుతున్నారని, పోలీసులు తమ పోలీస్ యూనిఫాం వదిలేసి గులాబీ కండువా కప్పుకోవాలని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రామాయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై డీకే అరుణ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న…
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన 17 ఏళ్ల యువతి హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఉగాది పండగ సందర్భంగా ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో…
ఉన్న భూమిలో సగం ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట తీసుకొని నష్టపరిహారం చెల్లించకుండా తిప్పుకోవడం.. ఎప్పటికో నష్టపరిహారం వచ్చింద కదా అనుకుంటుంటే.. మళ్లీ మిగిలిన భూమిని కూడా ప్రభుత్వాలు తీసుకునేందుకు అడుగులు వేయడంతో రైతుల కుటుంబాలు భరించలేక ఆత్మహత్యలు చేసుంటున్నారు. మరికొందరు భూమి పోతుందన్న బాధను దిగమింగలేక గుండెఆగి చనిపోతున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రామగుడు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో అదనపు కాలువ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఈ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మరణించడం, మరొకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. అడవి జంతువుల వేట వారి పాలిట మృత్యువు గా దాపురించింది. అడవి జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగా, ఆ మృతదేహం రెండు రోజులు అయినప్పటికీ లభించలేదు. పోలీసుల వేధింపులకు భయపడి మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. గత రెండు రోజుల నుంచి పోలీసులు…
కువైట్ ఆర్దియ హత్యకేసుల నిందితుడు వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్ సెంట్రల్ జైలులోనే సూసైడ్‌కు పాల్పడ్డాడు. కువైట్‌లో ముగ్గురిని హత్యచేసిన కేసులో వెంకటేష్ మీద ఆరోపణలు రావడంతో.. అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు. వెంకటేష్ స్వస్థలం కడప జిల్లా. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. Read Also:…
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మితిమీరిన ప్రవర్తనతో ఏపీలోని కొందరు పోలీసు అధికారులు క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారు.తాజాగా కృష్ణా జిల్లాలో ఓ ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. కృష్ణా జిల్లా రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఎ. కొండూరు (A,Konduru) ఎస్సై టి.శ్రీనివాసును సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ. నిన్న ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన బాలాజీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాటుసారా కేసులో విచారణ పేరుతో ఎ.కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ విచక్షణారహితంగా దాడి చేసిన…
కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. Read Also: యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళ్తే… భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో…
రాజేంద్రనగర్ పుప్పాలగూడ వద్ద భీమయ్య అనే ఎలక్ట్రీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న ఉదయం ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన భీమయ్య ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నార్సింగి పోలీసులకు భీమయ్య స్నేహితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ఈ రోజు ఉదయం పుప్పాల్ గూడ గుట్టల మధ్య మృతదేహం లభ్యమైంది. ఒంటి పై బట్టలు లేకుండా శరీరం పై తీవ్రగాయాలు, ఎడమ కాళు విరిగి…