అమ్మ తిట్టిందనో.. పరీక్ష పాస్ అవ్వలేదనో … ఆర్థిక ఇబ్బందులో.. అక్రమ సంబంధాల వల్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇదే పరిస్థితి. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దాంతో కన్నవాళ్లకు కడుపు కోత మిగులుతుంది. ఈ ఆత్మహత్యల వల్ల కొందరు పిల్లలను కోల్పోతుంటే.. మరికొందరు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఒకే కుటుంబంలోని 9మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు పొపట్ వన్మోరే(56), డాక్టర్ మాణిక్ వన్మోరే కుటుంబాలు ముందుస్తుగా నిర్ణయించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాయి. వీళ్లంతా విషం సేవించి చనిపోయినట్లు గుర్తించారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు, వీరి తల్లి, భార్యలు, నలుగురు పిల్లల మృతదేహాలను వారి ఇళ్లలో సోమవారం గుర్తించారు. అన్నదమ్ముళ్లు వేర్వేరు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్టు ప్రాథమిక సమాచారం. దీంతో ముందుస్తు అనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పొపట్ వన్మోరే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండుగా మాణిక్ వన్మోరే వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మైసల్ గ్రామంలోని అన్నదమ్ముళ్ల ఇళ్ల మధ్య దూరం 1.5 కిలోమీటర్లు ఉంది. రోజూ పాల కోసం తమ ఇంటికి వచ్చేవారెరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి.. మాణిక్ వన్మోరే ఇంటికి వెళ్లింది. ఇంట్లో పడివున్న మృతదేహాలను చూసి షాక్‌కి గురైంది. ీ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తును ఆరంభించారు.
కాగా.. ఇరువురి ఇళ్లలోనూ సూసైడ్ లేఖలు లభ్యమయ్యాయని, వీటిని విశ్లేషిస్తున్నామని ఇన్స్‌స్పెక్టర్ జనరల్(కోల్హాపూర్ రేంజ్) మనోజ్ కుమార్ లోహియా వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ సభ్యులు విషం పదార్థం సేవించారు. ఆత్మహత్యలుగా భావిస్తున్నప్పటికీ తీవ్రమైన ఘటన కావడంతో తదుపరి దర్యాప్తు జరుపుతామని పోలీసులు ప్రకటించారు. పూర్తి స్థాయి విచారణలోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆవిస్తున్నామన్నారు. మరణానికి కారణం ఏంటనేది పోర్ట్‌మార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందన్నారు.
అయితే.. మృతులలో పోపట్ యల్లప్ప వాన్‌మోర్ – వృత్తి రీత్యా వైద్యుడు కాగా, సంగీతా పోపట్ వాన్‌మోర్ (48), అర్చన పోపట్ వాన్‌మోర్ (30), శుభమ్ పోపట్ వాన్‌మోర్ (28), మానిక్ యల్లప్ప వాన్‌మోర్ (49), రేఖ మానిక్ వాన్మోర్ ( 45) మరియు ఆదిత్య మానిక్ వాన్ (15), అనితా మానిక్ వాన్మోర్ (28) మరియు అక్కాటై వాన్మోర్ (72)లను గుర్తించారు పోలీసులు. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన 9మంది ఆత్మహత్య చేసుకోవడంతో.. సాంగ్లీ జిల్లా వాసులు భయ భ్రాంతులకు గురవుతున్నారు. అంతగా ఏంజరిగిందని ఒకే సారి 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది ప్రతి ఒక్కిరికి ప్రశ్నార్థకంగా మారింది.కాగా..వీరి గ్రామం ముంబై నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష