Crime: ప్రేయసి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయి ప్రేమించడం లేదని.. ప్రేమించి తనను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటోందని.. ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇలా చాలా మంది యువకులు వివిధ కారణాలతో వారు చనిపోవడమో లేక అమ్మాయిలను చంపడమో చేస్తూ తమ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు. ప్రేయసి లేకపోతే జీవితమే లేదన్నట్లుగా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలానే.. ఓ ప్రియుడు తన ప్రేయసికి వేరే అతడితో పెళ్లి జరుగుతోందని తెలిసి.. ఆ వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జులై1న హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ వద్ద జరగగా.. సదరు యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.
Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిక్ అశ్వక్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలోనే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలిసి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఏం చేయలేక పెళ్లి జరుగుతున్న ఫంక్షన్‌హాల్ వద్దకు చేరుకుని కల్యాణ మండపం ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లోనే వెళ్లి వధువును హత్తుకునే ప్రయత్నం చేయగా.. బంధువులు ఆమెను పక్కకు లాగారు. స్థానికులు వెంటనే అతనిపై మంటలను ఆర్పేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. వధువు స్వల్ప గాయాలతో బయటపడింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ అశ్వక్ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. వధువు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!