Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోన్ ఆప్స్ నిర్వాకుల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అందరికీ ధైర్యం చెప్పాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో కలకలం సృష్టిస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ ని లోన్ నిర్వాహకులు విపరీతంగా వేధించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో భార్య ఫోటోలని మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలుగా తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ కానిస్టేబుల్ కి లో నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ నిర్వాహకులు చేసిన బెదిరింపులతో భయపడుతున్న కానిస్టేబుల్ ఏకంగా సూసైడ్ పాల్పడ్డాడు.
జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్ చందులాల్ బారదరి ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.ఆయనకు భార్య మాధవి, కూతురు ఉన్నారు. అయితే, గోల్డెన్ రూపీ అనే లోన్ యాప్ నుంచి ఆరు వేలు రుణాన్ని సుధాకర్ తీసుకున్నాడు. కానీ.. దాన్ని సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆయాప్ ఏజెంట్ల నుంచి వేధింపులకు ఎక్కువయ్యాయి. ఎన్నిసార్లు బాకీ సొమ్ము చెల్లించినా.. ఇంకా రుణం వుందంటూ ఫోన్ చేసి చిత్ర హింసలకు గురి చేశారు. అసభ్య పదజాలంతో ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి మానసికంగా హింసించేవారు. నీ మీ భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాతో పాటుగా బంధుమిత్రులుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. అంతేకాక, సుధాకర్ ఓ మోసగాడు అని కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. సుధాకర్ ఫోటో మీద చీటర్ అనే ముద్ర వేసి ఫోటోలని సోషల్ మీడియాతో పాటు మిత్రులకు పంపించారు. వీటన్నింటినీ మనస్తాపం చెంది సుధాకర్ ఇటీవల సన్నిహతుల వద్ద చెప్పుకున్నాడు. మనస్తాపానికి గురైనా సుధాకర్ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకెళ్లిన అన్న కుమార్‌కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా నిర్ణయం చెప్పారు. శివరాంపల్లి – శాస్త్రీపురం మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధాకర్ దగ్గర దొరికిన ఫోటో ఐడెంటికాలను గుర్తించి రైల్వే పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మెరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై గోల్డ్ రుపీ లోన్ యప్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
లోన్ అప్ నిర్వాకులు పెట్టే వేధింపులకు ఎవరు ఆందోళన చెందవద్దని, అలాంటి వేధింపులకు గురిచేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నా పోలీసు అధికారే భయపడి ప్రాణాలు తీసుకోవడంపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. లోన్ యాప్ వేధింపులు లోనుకావద్దను ఒక వేల ఆలాంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు తెలపాలని సూచించారు. వారు విధించినంతమాత్రాన విలువైన ప్రాణాలు తీసుకుని కుటుంబానికి దూరం కావద్దని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..