సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేతాచౌదరి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం ఆన్‌లైన్‌లో ఉండే శ్వేతా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్నేహితులతో చాట్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఒక అపరిచిత వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతను లక్షా 20 వేల రూపాయలు ఇస్తే 7లక్షలు ఇస్తానని శ్వేతను నమ్మించాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో అతడే శ్వేతకు రూ.50 వేల డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం రూ.50 వేలతో కలిపి మిగతా డబ్బును ఆమెతోనే కట్టించాడు. ఆ తర్వాత కూడా ఆమె లక్షా 30 వేలు చెల్లించింది. రెండ్రోజులుగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించింది. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె కాల్‌డేటాతో పాటు ఆమె డబ్బులు పంపిన అకౌంట్లు, సోషల్ మీడియా స్నేహితుల ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కూడా మాయగాళ్ల ఉచ్చులో పడడం చర్చనీయాంశంగా మారింది.
Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆన్‌లైన్ మోసానికి గురై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. గత 3 నెలలుగా ఇంటి నుంచే పని చేస్తోంది. సంస్థ కార్యాలయంలో నేరుగా విధులు నిర్వర్తించేందుకు ఆదివారం తెల్లవారుజామున బంధువులతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తాను చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లి ఫోన్‌కు సందేశం పంపింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన చిల్లకల్లు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.శనివారం రాత్రి గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మృతదేహం లభించింది. వివరాలు సేకరించిన పోలీసులు.. ఆన్‌లైన్ మోసమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు.