Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ 7వ ఫేజులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరి ఆత్మహత్యకు కారణం వీరి కుటుంబాల్లో వీరి ప్రేమను అంగీకరించకపోవడమే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన జ్యోతి, శ్యామ్ లుగా గుర్తించారు.
Read Also:YSRCP MLCs: కొత్తగా ఎన్నికైన 8 మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
వీరిద్దరూ హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరవడానికి వచ్చారు. శ్యామ్ గొల్లోనితిప్ప లో ఫాస్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జ్యోతి హైదరాబాద్ లో లేడీస్ హాస్టల్ ల్లో ఉంటుంది. జ్యోతి వివాహిత, విడాకులు తీసుకుంది.శుక్రవారం గొల్లోనితిప్ప నుండి నగరానికి వచ్చిన శ్యామ్ తన స్నేహితుడు రామకృష్ణకు ఫోన్ చేసి రూం కావాలని అడిగాడు. తాను ఊరెళ్తున్నాను వచ్చి రూంలో ఉండమని రామకృష్ణ చెప్పాడు. రామకృష్ణ రూమ్ కి వచ్చి జ్యోతిని పిలిపించుకున్నాడు శ్యామ్. రూముకు వచ్చిన వీరు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోయింది. శ్యామ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.
Read Also:KTR : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్